తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ మంచిర్యాలలో మహిళా సంఘాలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాయి. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని వెంటనే అరెస్టు చేసి ఉరితీయాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. సమాజంలో రోజురోజుకు మానవ విలువలు దిగజారి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అరబ్ దేశాలలో మాదిరిగా మహిళా రక్షణపై చట్ట సవరణలు చేయాలని కోరారు. సభ్య సమాజం సిగ్గుపడేలా ఘాతుకానికి పాల్పడిన నిందితున్ని బహిరంగంగా ఉరితీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అధికారులు సత్వరమే శిక్షించాలని మహిళలు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: భారత్లో పెళ్లితంతు రూటు మార్చుకుంది!