లాక్‌డౌన్ నేపథ్యంలో పనులు లేక అవస్థలు పడుతున్న పేదలకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రవి కుమార్ యాదవ్ చేయూత అందిస్తున్నారు. మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లి ఎల్లమ్మ బండ పరిధిలోని బీజేఆర్‌నగర్, ఎన్టీఆర్‌నగర్ కాలనీలో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా పేదలకు కూరగాయలు, శానిటైజర్లు, మాస్కులు అందజేశారు.
గత మూడు రోజులుగా రవి కుమార్ యాదవ్ కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. అందరు భౌతిక దూరం పాటిస్తూ... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. మరికొంత కాలం ఇళ్లకే పరిమితం కావాలని ప్రజలకు సూచించారు.
ఇదీ చూడండి: 'అలుపన్నదే లేకుండా పోరాడితేనే కరోనాపై విజయం'