ETV Bharat / state

గిరిపుత్రుల భూమికి ఎసరు.. తెలియకుండానే క్రయ విక్రయాలు - trading of tribal lands in mancherial district

వారంతా కాయకష్టం చేసుకుని జీవించే గిరిపత్రులు. మంచిర్యాల జిల్లాలో గత 65 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూమి ఇప్పడు వారిది కాదంటూ కొందరు అడ్డుపడుతున్నారు. దీంతో సాగుభూమిని లాక్కుంటే తామేలా బతికేది అంటూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. విరాసత్‌ చేయించుకున్న వారి నుంచి భూములను కొనుగోలు చేసుకున్న వ్యక్తులు రెండు నెలల కిందటే పట్టాపాస్‌ పుస్తకాలు పొంది, మోకా మీదికి రావడం.. అక్కడ గిరిజనులు సాగు చేస్తుండటంతో వివాదం రాజుకుంది.

trading of tribal lands in mancherial district
గిరిపుత్రుల భూమికి ఎసరు.. తెలియకుండానే క్రయ విక్రయాలు
author img

By

Published : Aug 11, 2020, 12:12 PM IST

స్వాతంత్య్రం రాకముందు 1945-47లో నిజాం కాలంలో పనిచేసిన వారికి అప్పటి ప్రభుత్వం గట్టు సిపాయిలు, జంగు సిపాయిల పేరుతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భూములు కేటాయించింది. 116 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ భూమిని 1954-55 నుంచి అంటే 65 ఏళ్ల నుంచి కాసిపేట ప్రాంతంలో ఉన్న గిరిజనులు సాగు చేస్తున్నారు. గట్టు సిపాయిలు, జంగు సిపాయిలు వారసులమని చెప్పి 2011లో కొందరు వ్యక్తులు వారి పేరు మీద విరాసత్‌ చేసుకున్నారు. ఈ విధంగా భూ హక్కులు పొందిన వారు మళ్లీ ఇతరులకు 2012లో విక్రయించారు. విరాసత్‌ చేయించుకున్న వారి నుంచి భూములను కొనుగోలు చేసుకున్న వ్యక్తులు రెండు నెలల కిందటే పట్టాపాస్‌ పుస్తకాలు పొంది, మోకా మీదికి రావడం.. అక్కడ గిరిజనులు సాగు చేస్తుండటంతో వివాదం రాజుకుంది.

trading of tribal lands in mancherial district
న్యాయం చేయాలంటూ ఎమ్మార్వో కార్యాలయం వద్ద గిరిజనుల ఆందోళన

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం కోమటిచేను సమీపంలో సర్వే నెంబరు 102లో 48 ఎకరాలు, సర్వే నెం.139లో 68 ఎకరాల భూమిని తరతరాలుగా రేగులగూడ, చింతగూడెం, ముత్యంపెల్లి, కోమటిచేను, తదితర గ్రామాల గిరిజనులు 25 మంది వరకు సాగు చేస్తున్నారు. 65 ఏళ్ల నుంచి కాస్తులో ఉన్న తమకు భూ హక్కులు కల్పించాలని పలుమార్లు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా మంచిర్యాలకు చెందిన కొందరు వ్యక్తులు వచ్చి ఈ భూమి తమదేనని చెప్పడంతో.. రైతులు ఆందోళన చేశారు. ఈ భూమి ఒక్కటే ఆధారమని, వదిలేది లేదని వారు స్పష్టం చేశారు. జంగు సిపాయి, గట్టు సిపాయి భూములకు సంబంధించి వివాదాలు కుమురం భీం జిల్లాలోని బెజ్జూరు, దహెగాం, కాగజ్‌నగర్‌, కౌటాల మండలాల్లోకూడా అధికంగా ఉన్నాయి.

1961-62 పహాణీలో సాగు కాలంలో ఉన్న గిరిజనుల పేర్లు

మా తాత, తండ్రుల నుంచి ఈ భూమినే సాగు చేసుకుంటూ జీవిస్తున్నాం. దాదాపు అయిదెకరాల భూమి ఉంది. నెల రోజుల కిందట కొందరు వ్యక్తులు వచ్చి ‘ఈ భూమి మాదని, పట్టాపాస్‌ పుస్తకాలు ఉన్నాయని’ అంటున్నారు. మా పేరు మీదే పట్టా చేయాలని ఎన్నో సార్లు రెవెన్యూ అధికారులకు మొర పెట్టుకున్నాం. జీవనాధారమైన భూమిని తీసుకుంటే ఎలా బతికేది. అధికారులు మా ప్రాంత రైతులకు న్యాయం చేయాలి.

- కుమురం తిరుపతి (కోమటిచేను-కాసిపేట)

గట్టు సిపాయి, జంగు సిపాయిల పేరు ఉన్న భూములను విరాసత్‌ చేయించుకున్న వారి నుంచి ఇతరులు కొనుగోలు చేయడం, వారికి పట్టాలు జారీ చేయడం నా హయాంలో జరగలేదు. నేను రాకముందే పట్టాలు జారీ చేశారు.

-భూమేశ్వర్‌, తహసీల్దార్‌, కాసిపేట

అసలేం జరిగింది...

1945లో జంగు సిపాయిలు, గట్టు సిపాయిల పేరు మీద ఉన్న ఈ భూమి పట్టాలో కాస్తు కాలంలో గిరిజన రైతుల పేర్లు 2011 వరకు ఉన్నాయి. అదే ఏడాదిలో అప్పటి ప్రభుత్వం వెబ్‌ల్యాండ్‌ రికార్డులను నవీకరించడంలో భాగంగా అంతర్జాలంలో భూమి వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ సమయంలోనే సాగు చేసే వారి వివరాలు పట్టా నుంచి తొలగించినట్లుగా గిరిజనులు అనుమానిస్తున్నారు. జంగు సిపాయిలు, గట్టు సిపాయిల పేరు మీద ఉన్న భూమి విరాసత్‌ చేయాలంటే.. మోకా మీద సాగులో ఉన్న రైతులను తప్పనిసరిగా సంప్రదించి, వారి అనుమతితోనే వారసులకు విరాసత్‌ చేయాలి. 2018లో నిర్వహించిన భూ ప్రక్షాళనలో సైతం ఈ భూమిపై వివాదం ఉన్నందున పార్ట్‌-బి లో చేర్చి ఎవరికీ పట్టా చేయలేదు. ఈ నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కిన రెవెన్యూ అధికారులు విరాసత్‌ చేయించుకున్న వారసుల నుంచి కొనుగోలు చేసిన మంచిర్యాలకు చెందిన వ్యక్తుల పేరు మీద కొత్త పట్టాపాస్‌ పుస్తకాలు జారీ చేశారు. వీరెవరూ సాగులో లేకున్నా రైతుబంధు పెట్టుబడి సహాయం సైతం రావడం గమనార్హం.

ఇదీ చదవండి: 'ఉపాధి హామీ పెంచి.. ఆ పథకం అమలు చేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.