Singareni strike: ప్రైవేటు వ్యక్తులకు బొగ్గు గనులను అప్పగించవద్దంటూ సింగరేణి కార్మికులు ఆందోళనబాట పట్టారు. సింగరేణికి చెందిన కళ్యాణి ఖని-6, కోయగూడెం బ్లాక్-3, సత్తుపల్లి బ్లాకు-3, శ్రావణ్‌పల్లి బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం నుంచి ఆపి... తిరిగి సంస్థకు అప్పగించాలంటూ టీబీజీకేఎస్ సహా జాతీయ సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎమ్ఎస్, సీఐటీయూ, బీఎమ్ఎస్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. బొగ్గు గనుల ప్రైవేటుపరం మరో 10 డిమాండ్లపై సింగరేణి యాజమాన్యంతో కార్మిక సంఘాలు చర్చలు జరిపినా ప్రయోజనం లేకపోవటంతో.... నేటి నుంచి మూడ్రోజుల పాటు సమ్మె నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే విధులు బహిష్కరించిన కార్మికులు.. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.
ప్రైవేటు వ్యక్తులను అడ్డుకుంటాం...
బొగ్గు బ్లాకుల వేలానికి ప్రతిపాదనలతో పాటు టెండర్‌లు వేసేందుకు కేంద్రం సిద్ధమవటం పట్ల సింగరేణి కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 4 బ్లాకులను ఈ జాబితాలో చేర్చినా... భవిష్యత్తులో మిగిలిన వాటిపై ఈ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. తమ కుటుంబాలను రోడ్డున పడేసేలా ఉన్న నిర్ణయాన్ని సాగుచట్టాల మాదిరిగానే కేంద్రం వెనక్కి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. నిరసనలతో సర్కార్ దిగిరాకపోతే నిరవధిక సమ్మె చేసేందుకైనా సిద్ధమని తేల్చిచెబుతున్నారు. సమ్మెతో ప్రయోజనం లేకపోతే బొగ్గు బ్లాకుల కోసం వచ్చే ప్రైవేటు వ్యక్తులను అడ్డుకుంటామని చెబుతున్నారు.
ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం..
మరోవైపు... సింగరేణి సంస్థ తరపున కేంద్రానికి లేఖ రాయడంతోపాటు... ఆయా బ్లాక్‌లలో చేపట్టిన అన్వేషణ పనులను వివరించినట్లు యాజమాన్యం చెబుతోంది. బొగ్గు బ్లాక్‌ల కేటాయింపు రాష్ట్రానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని అధికారులు వివరిస్తున్నారు. ఇప్పటికే కరోనా బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపగా... కార్మికుల సంఖ్యతో మరింత చూపే అవకాశముందని సంస్థ భావిస్తోంది.
ఇదీ చదవండి: KCR letter to Modi: బొగ్గు వేలం ఆపేయాలని.. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
Singareni Trade unions strike: సింగరేణిలో మోగనున్న సమ్మె సైరన్ ...