మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ మండలం బొక్కలగుట్ట గ్రామంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఎనిమిది మందిని రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ కిరణ్ వెల్లడించారు.
ఈ దాడుల్లో ఎనిమిది ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ తవ్వకాలు చేపట్టడం చట్టరీత్యా నేరమని సీఐ తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సంపత్‌కుమార్, భాస్కర్‌గౌడ్, ఓంకార్, రాకేష్ పాల్గొన్నారు.