క్రమశిక్షణకు మారుపేరుగా స్కౌట్ అండ్ గైడ్స్ నిలిచిపోయారని మందమర్రి ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రమేష్ రావు కొనియాడారు. మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి పాఠశాల మైదానంలో విద్యార్థులకు స్కౌట్స్ అండ్ గైడ్స్ పోటీలను జీఎం ప్రారంభించారు.
పురస్కారాలు సాధించిన వారికి ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యం ఉంటుందన్నారు. ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పోటీలకు సింగరేణి ప్రాంత జిల్లాల నుంచి సుమారు 100 మంది హాజరయ్యారు.
ఇదీ చూడండి : వైభవంగా జడ్పీ ఛైర్పర్సన్ శ్రీహర్షిని పెళ్లి వేడుక