తెలంగాణ గ్రామీణ బ్యాంకులు స్వయం సహాయక గ్రూపు సభ్యులకు కొవిడ్-19 మహిళా నేస్తం పథకం ద్వారా రుణాలు మంజూరు చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలోని భీమిని తెలంగాణ గ్రామీణ బ్యాంకు పరిధిలో 285 స్వయం సహాయక గ్రూపు సంఘాలు ఉన్నాయి. అందులో బ్యాంకుకు సక్రమంగా రుణాలు చెల్లిస్తున్న గ్రూపు సంఘాలు 220 ఉండగా ఒక్కొక్క గ్రూపులో పది మంది చొప్పున సుమారు 2,200 మంది గ్రూపు సభ్యులకు లబ్ధి చేకూరనుంది. గ్రూపు సంఘంలో ఒక్కొక్కరికి రూ.5 వేల రుణం అందించనుంది.
కోవిడ్-19 మహిళా నేస్తం రుణం పొందడానికి అర్హతలు
* మహిళలు స్వయం సహాయక సంఘంలో గ్రూపు సభ్యురాలుగా ఉండాలి.
* ఇంతకు ముందు తీసుకున్న రుణాలు బ్యాంకుకు సక్రమంగా కడుతున్న గ్రూపు సంఘాలు.
* తీసుకున్న రుణం మూడు సంవత్సరాలలోపు చెల్లించాలి.
* రుణం మంజూరికి గడువు మే నెల చివరి వారం వరకు.
రుణంలో సడలింపులు
* రుణం తీర్చేందుకు మూడు సంవత్సరాలలో మొదటి ఆరు నెలలు రుణం కట్టవచ్చు లేదా కట్టకపోవచ్ఛు
* ఇంతకు ముందు తీసుకున్న రుణాలు చివరి రెండు కిసీ్తీలు కట్టని గ్రూపు సంఘ సభ్యులు కూడా అర్హులే.