మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీపీఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశంకు రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హాజరయ్యారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణించి పోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఆటోమొబైల్ రంగంతో పాటు ఇతర రంగాల్లో ఉత్పత్తులు తగ్గిపోయి ఆర్థిక స్థితి దెబ్బతిందని వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న భాజపాకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైందని ఉద్ఘాటించారు.
ఇవీ చూడండి: అక్కడ డబ్బులు ఉతికేస్తున్నారు