మంచిర్యాల జిల్లా మందమర్రిలో కరోనాతో సింగరేణి విశ్రాంత కార్మికుడు (79) మృతి చెందాడు. పది రోజుల క్రితం అనారోగ్యంతో మంచిర్యాల ఆస్పత్రిలో చేరాడు. ఆరోగ్యం ఎంతకీ కుదుటపడకపోవడంతో కరోనా పరీక్షలు చేసుకోగా పాజిటివ్ వచ్చింది. హోం ఐసోలేషన్లో చికిత్స తీసుకుంటున్న క్రమంలో ఆరోగ్యం మరింత క్షీణించి గురువారం మృతి చెందాడు.
108 అంబులెన్స్ రాకలో జాప్యం
ఇంటిపెద్ద మృతి చెందడంతో ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో కుటుంబసభ్యులు ఉండిపోయారు. ఒక్కరిద్దరు బంధువులు మినహా ఇతరులెవ్వరు అక్కడికి రాలేదు. 108కు సమాచారం అందించగా వారు ఆరు గంటల తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి వచ్చిన మందమర్రి మున్సిపల్ కమిషనర్ రాజు, ఎస్సై భూమేష్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. కొవిడ్ నిబంధనల ప్రకారం 108 సిబ్బంది మృతదేహాన్ని పట్టణ శివారు ప్రాంతానికి తీసుకొచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఇదీ చదవండి: పరిమితి సమయాల్లోనే హైదరాబాద్ మెట్రో సేవలు