మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి పాఠశాల మైదానంలో ఏరియా స్థాయి కార్మిక క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇంఛార్జీ జీఎం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకే ఏటా సింగరేణి యాజమాన్యం ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. క్రీడల్లో సత్తా చాటి సింగరేణి పేరును నిలబెట్టాలని సూచించారు.
ఇవీ చూడండి : రికార్డు: 73 ఏళ్ల బామ్మకు కవల పిల్లలు