మంచిర్యాల జిల్లా మందమర్రిలో సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని కార్మికులు, వారి కుటుంబసభ్యులు, అధికారులు ఘనంగా జరుపుకున్నారు. సింగరేణి పాఠశాల మైదానంలో జీఎం రమేశ్రావు జెండాను ఆవిష్కరించి కార్మిక కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను జీఎం దంపతులు ప్రారంభించి వాటిని గురించి అడిగి తెలుసుకున్నారు.
ఇవీ చూడండి: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు