మంచిర్యాల జిల్లా మందమర్రిలో సింగరేణి ఫైనాన్స్ విభాగం ఎండీ బలరాం కేకేఫై గనికి చెందిన ఖాళీ స్థలంలో 800 మొక్కలు నాటారు. సంస్థ అధికారులు, కార్మికులతో కలిసి మొక్కలు నాటారు. ఎంతో ఉత్సాహంగా 800 మొక్కలు నాటి కార్మికులను ఉత్సాహ పరిచారు. ఈ కార్యక్రమానికి మందమర్రి జీఎం చింతల శ్రీనివాస్ హాజరై హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మనుషుల జీవన ప్రమాణాలు పెరగాలంటే ప్రతి ఒక్కరూ 3 మొక్కలు విధిగా నాటాలని డైరెక్టర్ బలరాం పిలుపునిచ్చారు. ఏటా సింగరేణి యాజమాన్యం లక్షలాది మొక్కలను నాటుతుందని.. వాటిలో 90శాతం మొక్కలు బతుకుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండిః వర్షం వస్తే రోడ్లు చెరువులవుతున్నాయి!