మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కాసిపేటగని వద్ద తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. ప్రైమరీ కాంటాక్ట్ కార్మికులందరికీ కొవిడ్ పరీక్షలు చేయాలని డిమాండ్ చేశారు.
కరోనా భయంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం స్పందించి వైరస్ టెస్టులు చేయాలని విన్నవించుకుంటూ సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఇదీ చూడండి : పీఎస్కు వచ్చే ఫిర్యాదు పేపర్లను ఇస్త్రీ చేస్తున్న పోలీసులు