ETV Bharat / state

సింగరేణీ డీజిల్​ కుంభకోణంపై కేంద్ర నిఘా విభాగం విచారణ - singareni cmd sridhar

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​లో సింగరేణి ఉపరితల గనిలో డీజిల్​ కుంభకోణంపై కేంద్ర విజిలెన్స్​ విభాగం విచారణ చేపట్టింది. ఓపెన్‌కాస్ట్​లో రూ.300 కోట్ల డీజిల్‌ కుంభకోణం జరిగిందని సీవీసీలో ఓ కార్మిక సంఘం ఫిర్యాదు చేసింది.

singareni diesel scam  in srirampur open cast mines
సింగరేణీ డీజిల్​ కుంభకోణంపై కేంద్ర నిఘా విభాగం విచారణ
author img

By

Published : Jul 1, 2020, 2:26 PM IST

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఉపరితల గనిలో డీజిల్ కుంభకోణంపై కేంద్ర నిఘా విభాగం విచారణ చేపట్టింది. 2018 నుంచి శ్రీరాంపూర్ లోని ఉపరితల గనిలో ఆగకుండా డీజిల్ దుర్వినియోగం అవుతున్నా.. అధికారులకు చీమ కుట్టినట్లయినా లేకపోవడం కార్మిక వర్గాన్ని విస్మయానికి గురి చేసింది. కార్మిక నాయకులు, కార్మికులు తమ సంస్థలో జరుగుతున్న అవినీతిని ఎండగట్టడంతో కప్పిపుచ్చడానికి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు.

ఈ విషయం సంస్థ సీఎండీ శ్రీధర్ దృష్టికి వెళ్లడంతో విజిలెన్స్ అధికారులు మరింత జాగ్రత్తగా వ్యవహరించి విచారణ జరిపారు. డీజిల్ దుర్వినియోగంపై కీలక సమాచారం సేకరించడంతో సీఎండి ఆదేశాల మేరకు గుత్తేదారుపై మరోసారి పోలీస్ కేసు నమోదు చేశారు. విజిలెన్స్ విచారణ మేరకు అప్పటి శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ సుభాని , ప్రాజెక్టు అధికారి, గని మేనేజర్, సెక్యూరిటీ అధికారిని బదిలీ చేశారు.

దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కార్మిక సంఘాల నుంచి ఒత్తిడి మొదలైంది. చివరికి నలుగురు అధికారులకు చార్జిషీట్ ఇవ్వడం సింగరేణిలో సంచలనం రేకెత్తించింది. ఫలితంగా సింగరేణి వ్యాప్తంగా డీజిల్ వినియోగం తగ్గుముఖం పట్టింది. ప్రధానంగా శ్రీరాంపూర్​లోని సింగరేణిలో డీజిల్ వాడకం దాదాపు సగానికి తగ్గింది.

అయినప్పటికీ డీజిల్ ఇతర మార్గాల్లో అప్పుడప్పుడు దుర్వినియోగం చేసిన ఘటనలు వెలుగు చూశాయి. రెండు డీజిల్ ట్యాంకుల ద్వారా అక్రమంగా తరలించడం.. ఇలాంటి సంఘటనలు పట్టుబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సింగరేణి సంస్థకు దాదాపు 300 రూపాయల కోట్ల మేరకు నష్టం కలిగించిన ఈ ఘటనపై ఉన్నత అధికారులకు ఇచ్చిన ఛార్జిషీటుపై చేపట్టిన విచారణ అనుమానాలు రేకెత్తిస్తోంది.

విచారణలో కొందరు అధికారులు పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రక్రియలో భాగంగా రాజకీయ జోక్యం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. సింగరేణి ఉన్నతాధికారిని నిర్దోషిగా బయటపడడానికి ఒకరిద్దరు రాజకీయ నాయకులు జోక్యం చేసుకున్నారనే ప్రచారం జరిగిన నేపథ్యంలో, పూర్తి ఆధారాలను జత పరుస్తూ కేంద్ర నిఘా విభాగానికి ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం.

దీని ఆధారంగా కేంద్ర నిఘా అధికారులు విచారణ చేపట్టారు. కోల్ ఇండియా పరిధిలో జరిగిన అవినీతిపై అనేకమంది అధికారులపై కేంద్ర విజిలెన్స్ విభాగం చర్యలకు ఆదేశించింది. సింగరేణిలో తొలిసారిగా కుంభకోణంపై విచారణ జరుపుతున్న కేంద్ర విజిలెన్స్ విభాగం తీసుకునే చర్యలపై కార్మిక వర్గం ఆసక్తిగా పరిశీలిస్తోంది.

ఇవీ చూడండి: 'ఆయురారోగ్యాలతో విరాజిల్లాలి... దేశానికి మరింత సేవచేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.