మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని రామగుండం కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. లారీ, ట్రాలీలో బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్నారన్న సమాచారంతో వేలాల-చెన్నూరు రహదారిపై తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన లారీ, ట్రాలీని పరిశీలించి.. సుమారు రూ.4.20 లక్షల విలువైన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న సర్వేష్, కార్తీక్, విశ్వనాథ్‌ను అరెస్టు చేయగా.. రమేష్ అనే మరో వ్యక్తి పరారీలో ఉన్నారు. రెండు వాహనాలను, మూడు సెల్ఫోన్లను సీజ్ చేసి జైపూర్ పోలీసులకు అప్పగించారు.
ఇదీ చదవండి: తెరాస, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా