ETV Bharat / state

ఉరేసుకుని పారిశుద్ధ్య ఒప్పంద కార్మికులు ఆత్మహత్య - suicide latest news

మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఓ పారిశుద్ధ్య ఒప్పంద కార్మికురాలు ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో స్నానాల గదిలో ఉరేసుకుని బలవన్మరణం చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

sanitation worker suicide in mandamarri
sanitation worker suicide in mandamarri
author img

By

Published : Feb 9, 2021, 10:41 AM IST

మంచిర్యాల జిల్లా మందమర్రిలో విషాదం చోటుచేసుకుంది. పురపాలికలో ఒప్పంద కార్మికులిగా పనిచేస్తున్న గొర్రె లక్ష్మి (35) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జన్నారానికి చెందిన లక్ష్మికి, మందమర్రి చెందిన నరేశ్​తో 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు.

ప్రస్తుతం... రమేశ్​ ముంబైలో పనిచేస్తుండగా... లక్ష్మి మాత్రం పారిశుద్ధ్య కార్మికురాలుగా విధులు నిర్వహిస్తోంది. విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిన లక్ష్మి.... స్నానాలగదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎంతసేపైనా తల్లి కనిపించకపోవడం వల్ల కూతుళ్లు వెతకగా శవమై కనిపించింది. పోలీసులకు సమాచారం అందించగా... ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి: పేస్టులా బంగారాన్ని మార్చి... ఎయిర్​పోర్టులో దొరికి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.