మంచిర్యాలలో రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్రమార్కులపై దాడులు నిర్వహించారు. ఏక కాలంలో గుట్కా వ్యాపారులు, పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు .రాజీవ్‌నగర్‌లోని చెట్ల పొదలలో పేకాట ఆడుతున్న పది మందిని అరెస్టు చేసి... రూ. 47 వేలు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ సముదాయంలోని రెండు కిరాణ దుకాణలలో నిషేదిత గుట్కా అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. సుమారు రూ.17 వేల విలువగల నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నారు.
కరోనా వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో గుట్కా, పొగాకు ఉత్పత్తులను ప్రభుత్వం పూర్తిగా నిషేధించిందని పోలీసులు తెలిపారు. అయినప్పటికీ కొంతమంది వ్యాపారస్థులు నిషేధిత వస్తువులను అమ్ముతూ... కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి దోహదం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చట్ట వ్యతిరేకమైన పనులు చేసే వారిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు హెచ్చరించారు.