మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న తీరును రామగుండం సీపీ సత్యనారాయణ తనిఖీ చేశారు. పట్టణంలో సీపీ ద్విచక్రవాహనంపై తిరుగుతూ లాక్డౌన్ను ఉల్లంఘించి రోడ్లపై కనిపించిన వారిపై లాఠీ ఝుళిపించారు. అనవసరంగా బయటకు వస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మే నెల 7 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుందని తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. డీసీపీ ఉదయకుమార్ రెడ్డి, ఏసీపీ రహమాన్ పాల్గొన్నారు.
ఆకతాయిలను పరుగులు పెట్టించిన సీపీ
బెల్లంపల్లి పట్టణంలోని పలు కాలనీల్లో రామగుండం సీపీ సత్యనారాయణ లాక్‌డౌన్ ఎలా కొనసాగుతుందో పరిశీలించారు. వీధుల్లో పర్యటిస్తూ అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వ్యక్తులపై లాఠీ ఝుళిపించారు. ఆకతాయిలను పరుగులు పెట్టించారు.
ఆకతాయిలపై లాఠీ ఝుళిపించిన సీపీ