మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో అకాల వర్షం దంచి కొట్టింది. వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మకానికి తెచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. ఎండకు ఆరబెట్టిన ధాన్యం తీసుకునే లోగానే తడిసిపోయింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అమ్మకానికి తీసుకురాగా వర్షార్పణమైందని అన్నదాతలు కన్నీటి పర్యంతమవుతున్నారు.
కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యాన్ని సకాలంలో తూకం వెయ్యకపోవడం వల్ల, తూకం వేసిన ధాన్యాన్ని తరలించకపోవడం వల్ల నష్టపోయామని వాపోతున్నారు. తడిచిన ధాన్యంలో కోత విధించకుండా పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి తమకు న్యాయం చెయ్యాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: కొరత లేనప్పుడు ఇంతమంది ఎలా చనిపోతున్నారు: బండి సంజయ్