ETV Bharat / state

ప్రైవేటు వైద్యం... మరింత భారం...

దాదాపు రెండు నెలల తర్వాత ప్రైవేటు ఆసుపత్రుల్లో సేవలు ప్రారంభమయ్యాయి. స్వీయ జాగ్రత్తలతో వైద్యులు పరీక్షలు మొదలుపెట్టారు. లాక్‌డౌన్‌కు ముందు బాధితుల నుంచి ఫీజుల పేరుతో ఎలా దండుకున్నారో.. తర్వాత మరింత రెట్టింపు చేసి దడ పుట్టిస్తున్నారు.

private hospitals charging heavy fees in manchiryal
ప్రైవేటు వైద్యం... మరింత భారం...
author img

By

Published : May 27, 2020, 8:20 AM IST

మంచిర్యాలలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో వసూలు చేస్తున్న ఫీజులు చూస్తే కార్పొరేట్‌ను తలదన్నేలా ఉన్నాయి. ఒకటి, రెండు ఆసుపత్రులు మినహా కేవలం వైద్యుడిని కలవడానికే రూ.300- 500 వరకు వసూలు చేస్తున్నారు. అదనంగా రక్త, మూత్ర పరీక్షలతో పాటు స్కానింగ్‌ కూడా చేయిస్తున్నారు. ఆ తర్వాత గానీ మందులు రాయడంలేదు. అప్పటికే బాధితుల జేబులు ఖాళీ అవుతున్నాయి.

సౌకర్యాలు అంతంతమాత్రమే..

తీసుకున్న ఫీజులకు కనీస సౌకర్యాలు కల్పించడంలేదు. రోగులు కూర్చోడానికి కుర్చీలు వేయడంలేదు. గంటల తరబడి ఎండలోనే నిల్చుంటూ నీరసించిపోతున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా జాగ్రత్తలు తీసుకోవడంతో ఖర్చు పెరుగుతుందని, అందుకే ఫీజులు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని వైద్యులు చెబుతుండటం విశేషం.

ఐఎంఏకు సంబంధం లేదా..

కరోనా వ్యాప్తి దృష్ట్యా ఐఎంఏ సూచనల మేరకే ప్రైవేటు ఆసుపత్రులను మూసివేశామని చెప్పిన వైద్యులు.. ఫీజులు పెంచే విషయంలో ఐఎంఏకు ఎటువంటి సంబంధం ఉండదని చెబుతున్నారు.ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్‌తో పనుల్లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే అప్పులపాలు కావాల్సిందే.

అదనంగా అమ్మకాలు..

చెన్నూరుకు చెందిన ఓ వ్యక్తి తన కుమారుడిని జిల్లా కేంద్రంలోని ఓ కంటి వైద్యుడి దగ్గరికి తీసుకొచ్చారు. ఆసుపత్రి సిబ్బంది శానిటైజర్‌ సీసా, మాస్క్‌, రెండు పేపర్లు చేతిలో పెట్టి రూ.70 ఇవ్వమన్నారు. ఇదేంటని అడిగితే వైద్యుడు బయటకు వచ్చి వాటిని కొంటేనే పరీక్షిస్తామని, లేదంటే వెళ్లిపొమ్మని చెప్పగా చేసేదేమిలేక మరో ఆసుపత్రికి వెళ్లారు.

* అదే కంటి ఆసుపత్రికి తాండూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి వచ్చారు. ఆయన జేబులోనే శానిటైజర్‌తో పాటు ముఖానికి రుమాలు కట్టుకున్నారు. అయినా మేము అమ్ముతున్న మాస్క్‌, శానిటైజర్‌ వినియోగించాలని స్పష్టం చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రూ.70 ఇచ్చి తీసుకున్నారు. మరో రూ.300 చెల్లించి పరీక్షించుకున్నారు.

ఓ కిరాణాషాపులో పనిచేసే వ్యక్తి కడుపునొప్పి వస్తుందని జన్మభూమినగర్‌లోని ఓ ఆసుపత్రికి వెళ్లాడు. అవసరంలేని ఐసీయూలో పెట్టి సుమారు రూ.4 వేలు కట్టించుకున్నారు. మరో రూ.5 వేలు చెల్లించాలంటున్నారని తనవద్ద అంత సొమ్ము లేదని చెబుతున్నా పట్టించుకోవడంలేదని చెప్పారు.

ఫీజుల విషయంలో జోక్యం ఉండదు - డా.రమణ, ఐఎంఏ మంచిర్యాల అధ్యక్షుడు

ఐఎంఏకు ప్రైవేటు వైద్యులకు సంబంధించి అన్ని విషయాల్లో జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. ఫీజు పెంచడం, తగ్గించడం వైద్యుల వ్యక్తిగతం. బాధితులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచిస్తామే తప్ప ఆర్థిక లావాదేవిల్లో ఎటువంటి ప్రమేయం ఉండదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.