ETV Bharat / state

కొవిడ్​ టీకా తీసుకున్న గర్భిణి.. గర్భస్రావమైందంటూ బంధువుల ఆందోళన

author img

By

Published : Nov 10, 2021, 10:36 AM IST

కొవిడ్‌ టీకా వేయడం వల్లే.. గర్భిణికి గర్భస్రావం అయ్యిందంటూ… బంధువులు అంబులెన్స్‌ను అడ్డుకున్న ఘటన మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నర్సాపూర్‌లో చోటు చేసుకుంది. వ్యాక్సిన్ వేయడం వల్లే 5 నెలల గర్భిణీకి గర్భస్రావం జరిగి.. శిశువు చనిపోయిందని కుటుంబీకులు ఆరోపించారు.

pregnant woman has miscarriage after covid vaccination in mancherial
గర్భస్రావమైందంటూ బంధువుల ఆందోళన

కరోనా రాకుండా ప్రజలందరూ టీకా వేసుకుంటున్నారు. వైరస్ రాకూడదని, విజృంభించకూడదనే ఉద్దేశంతోనే అధికారులు.. ప్రజలను వ్యాక్సిన్ వేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రజలు కూడా కొవిడ్​ టీకా వేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. అదేవిధంగా ఈనెల 6న మంచిర్యాల జిల్లాలోని నర్సాపూర్​ గ్రామానికి చెందిన 5 నెలల గర్భిణి కరోనా టీకా తీసుకున్నారు. స్థానిక వైద్య సిబ్బంది ఆమెకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేశారు.

ఈ నెల 9వ తేదీన ఆమెకు నొప్పి రావడంతో కుటుంబసభ్యులు అంబులెన్స్​కు ఫోన్​ చేశారు. వాహనం వచ్చే లోపు గర్భంలోని శిశువు చనిపోయిందని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణికి బలవంతంగా టీకావేశారని... టీకా కారణంగా ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. వ్యాక్సినేషన్​ వల్లనే అబార్షన్ అయ్యిందంటూ అంబులెన్స్​లను అడ్డుకుని ఆందోళన చేశారు. పోలీసులు ఆందోళనకారులకు నచ్చజెప్పి ఆమెను చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: Pregnant Died: సకాలంలో వైద్యం అందక నిండు గర్భిణి మృతి

కరోనాతో గర్బణి మృతి.. సంతాపం ప్రకటించిన జిల్లా కలెక్టర్

'ప్రైవేటు ఆస్పత్రుల నిర్లక్ష్యం వల్లే "నిండుచూలాలు" మృతి'

అంబులెన్స్‌లో గర్భిణి మృతిపై విచారణకు ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.