ETV Bharat / state

ఇంట్లోంచి పారిపోయిన యువతి... ​100తో రక్షించిన పోలీసులు

డయల్ 100పై తక్షణ స్పందనతో ఓ యువతిని కాపాడారు మంచిర్యాల జిల్లా పోలీసులు. కుటుంబసభ్యులపై అలిగి ఆత్మహత్య చేసుకునేందుకు ఇంట్లోనుంచి వెళ్లిపోయిన యువతిని సకాలంలో పట్టుకుని తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.

police secured one girl in manchiryala district through dail 100
ఇంట్లోంచి పారిపోయిన యువతి... డయల్​100తో రక్షించిన పోలీసుల
author img

By

Published : Dec 3, 2019, 6:07 PM IST

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో ఓ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయిందని రాత్రి 100కు ఫోన్​ వచ్చింది. వెంటనే స్పందించిన సిబ్బంది మంచిర్యాల పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు యువతి కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఆచూకి లభించక పోవడం వల్ల డీసీపీ ఉదయ్​కుమార్​ రెడ్డికి సమాచారం అందించి... ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో యువతిని గుర్తించారు.

మంచిర్యాల పట్టణంలో ఐబీ చౌరస్తా వద్ద ఈనాడు దినపత్రిక తరలించే వాహనంలో యువతిని గుర్తించారు. ఆమెను విచారించగా కుటుంబ సభ్యులపై అలిగి ఆత్మహత్య చేసుకోవాలని ఇంట్లోంచి పారిపోయి వచ్చానని తెలిపింది. తన తండ్రి ఆస్పత్రిలో ఉన్నాడని మంచిర్యాలలో దింపమని కోరితే వాహనంలో తీసుకొచ్చారని పోలీసులు తెలిపారు. యువతి దొరకడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీస్ సేవలను ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని డీసీపీ తెలిపారు.

ఇంట్లోంచి పారిపోయిన యువతి... డయల్​100తో రక్షించిన పోలీసుల

ఇదీ చూడండి: చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం

File: TG_ADB_13_03_DIAL 100 REOPENCES_AV_TS10032 REPORTER:SANTHOSH.MAIDAM, MANCHERIAL... () : డయల్ 100 కాల్ కు తక్షణ స్పందన.. మంచిర్యాల జిల్లా మండలం లోని దండేపల్లి మండలం లోని ఓ యువతి ఇంటి నుండి పారిపోయిందని గత రాత్రి డయల్ 100కు తన తండ్రి సమాచారం అందించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఫిర్యాదుదారు ని ఇంటి వద్ద తనిఖీలు చేశారు. యువతి ఆచూకీ దొరక్కపోవడంతో మంచిర్యాల లక్సెట్టిపేట హాజీపూర్ పోలీస్ స్టేషన్లలో మంచిర్యాల డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి సమాచారం అందించడంతో ప్రధాన రహదారిపై వెళ్తున్న వాహనాలను తనిఖీలు చేశారు. మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద యువతి ఈనాడు దినపత్రిక తరలించే వాహనాలలో యువతి పోలీసులకు దొరకడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లక్సెట్టిపేట లో ప్రధాన రహదారిపై ఒంటరిగా నిల్చున్న యువతిని పేపర్ జీప్ డ్రైవర్ గమనించి ఆమెను అడగడంతో తన తండ్రికి రోడ్డు ప్రమాదం జరిగిందని తనను మంచిర్యాలలోని ఆస్పత్రిలో దింపమని కోరడంతో జీపులో ఎక్కించుకుని మంచిరాల కు వస్తున్న క్రమంలో ఆమె కోసమే తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు పట్టుబడిందని మంచిర్యాల డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతిక్షణం పోలీస్ ప్రజల కోసమే పని చేస్తుందని శంషాబాద్ ఘటనలను ఎవరు కూడా పునరావృతం కాకుండా చూసుకోవాలని పోలీస్ సేవలను ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని డిసిపి తెలిపారు. బైట్: ఉదయ్ కుమార్ రెడ్డి, డి సి పి మంచిర్యాల....

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.