ETV Bharat / state

'మేం చెప్పినట్టు వినాలి తప్ప.. మీ అజమాయిషీ నడవదు' - pattana pragathi updates

'మీ వార్డు అభివృద్ధి కావాలంటే మేం చెప్పినట్టు వినాలి తప్ప.. మీ అజమాయిషీ నడవదు. నేను పట్టించుకోకపోతే మీ వార్డు ఎలా అభివృద్ధి చేసుకుంటావో చేసుకో' ఈ మాటలు అన్నది ఎవరో కాదు మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.

Pattana pragathi program in manchiryala
పట్టణ ప్రగతిలో వాగ్వాదం
author img

By

Published : Mar 1, 2020, 10:24 PM IST

పట్టణ ప్రగతిలో వాగ్వాదం

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 24వ వార్డుకు వచ్చిన ఎమ్మెల్యేకు, ఆ ప్రాంత కాంగ్రెస్ కౌన్సిలర్​కు మధ్య మాటల యుద్ధం జరిగింది. వార్డుకు వచ్చిన ఎమ్మెల్యేకు సమస్యలు చూపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ తీసుకెళ్లగా.. తెరాస నేతలు ఎమ్మెల్యేను మరోవైపు తీసుకెళ్లారు. ఈ సందర్భంలో వాగ్వాదం చోటు చేసుకుంది.

సమస్యలు ఇక్కడ ఉంటే మీరు పక్కకు ఎందుకు తీసుకువెళ్తున్నారని కాంగ్రెస్ కౌన్సిలర్ ప్రశ్నించాడు. అధికార పార్టీ నాయకులతో దురుసుగా ప్రవర్తిస్తే మీ వార్డు ఎలా అభివృద్ధి చెందుతుంది శాసనసభ్యుడు దివాకర్ రావు వారించారు.

మేము పట్టించుకోకపోతే మీ వార్డు ఎలా అభివృద్ధి చేసుకుంటావో చేసుకోమని ఏకంగా ఎమ్మెల్యే అనడం వల్ల అభివృద్ధి కమిటీ నాయకులతో పాటు కౌన్సిలర్ మాటల యుద్ధానికి దిగారు. వార్డు అభివృద్ధికి పాటుపడతారని అనుకుంటే స్వయంగా ఎమ్మెల్యే ఇలా మాట్లాడడం విడ్డూరంగా ఉందని కౌన్సిలర్ సంజీవ్ వాపోయారు.

మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాత్రం అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏమీ లేవని ప్రతి ఒక్కరూ ఆయా వార్డుల అభివృద్ధికి పాటుపడాలని చెబుతుంటే ఇక్కడ మాత్రం పార్టీల వారీగా విభజిస్తున్నారని తెలిపారు.

ఇదీ చదవండి:మారుతున్న తీరు.. రెండో పెళ్లికి సై అంటున్నారు వీరు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.