ETV Bharat / state

చోరీ చేసి బైక్​ విడిచి పరారైన దొంగలు - latest news of manchiryala

మంచిర్యాల జిల్లా మందమర్రిలోని రెండు ఇళ్లలో వరస దొంగతనాలు జరిగాయి. అయితే దొంగల శబ్ధం విన్న స్థానికులు గుమిగూడే సరికి బైక్​ విడిచి అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ornaments theft in two homes at mandamarri in manchiryala district
చోరీ చేసి బైక్​ విడిచి పరారైన దొంగలు
author img

By

Published : Jul 6, 2020, 8:45 PM IST

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని రామన్ కాలనీ, యాపల్ కాలనీల్లోని 2 ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. సింగరేణి విశ్రాంత ఉద్యోగి ఇంట్లోని 15 గ్రాముల బంగారం, పదిహేను తులాల వెండి ఆభరణాలతో పాటు ఏడు వేల నగదును కొల్లగొట్టినట్టు కుటుంబ సభ్యులు వాపోయారు.

మరో బాధితుడు సుధాకర్ ఇంట్లో 5 తులాల వెండి ఆభరణాలను చోరీ చేశారు. ఇదిలా ఉండగా దొంగలు వదిలి వెళ్ళినట్లు భావిస్తున్న ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో మూడు చరవాణీలతో పాటు రెండు కెమెరాలు ఉన్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు... పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.