ETV Bharat / state

80ఏళ్లయినా కుర్రాడే... బరిలోకి దిగితే అంతే - old man

అతని వయసు అక్షరాలా ఎనిమిది పదులు. అయినా అతనిలో సత్తా తగ్గలేదు. కుర్రాళ్లకు ధీటుగా ఎన్నో పతకాలు సాధిస్తున్నాడు. 80 ఏళ్ల వయసులో అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఏ దేశంలో అయినా సరే అద్భుత విజయాలు సొంతం చేసుకుంటూ ఔరా అనిపిస్తున్నాడు మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన నర్రా సత్యనారాయణ.

పతకాలతో సత్యనారాయణ
author img

By

Published : May 7, 2019, 12:46 PM IST

80ఏళ్లయినా కుర్రాడే... బరిలోకి దిగితే అంతే

ఈయన పేరు నర్రా సత్యనారాయణ, మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో నివాసం ఉంటారు. ఎనిమిది పదుల వయసులో ఎన్నో పతకాలు సాధిస్తున్నారు. లక్సెట్టిపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా సేవలందించి పదవీ విరమణ పొందిన తర్వాత శరీర దృఢత్వంపై శ్రద్ధతో వ్యాయామాన్ని ప్రారంభించారు.
తన మునిమనవలతో పరుగెత్తాలని ఆశతో పరుగును ప్రారంభించిన సత్యనారాయణ జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు పోటీల్లో పాల్గొన్నాడు. ఇటీవలే గుజరాత్, మలేషియా, ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన క్రీడా పోటీల్లో పాల్గొని 800 మీటర్ల పరుగులో మూడో స్థానం, 100 మీటర్ల పరుగులో రెండో స్థానం సాధించాడు.

ప్రోత్సాహంచాలి

నేటి యువత మద్యానికి బానిసై విలువైన జీవితాలను కోల్పోతున్నారని సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఉక్కు కండరాలు, బలమైన సంకల్పం కలిగి ఉండాలని ఆకాక్షించారు. ప్రతినిత్యం శాఖాహారం, పౌష్టిక ఆహారం తీసుకోవడం వల్లనే మంచి ఆరోగ్యంగా ఉన్నానని చెబుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం అందించాలని కోరారు. 80 ఏళ్ల వయసులో సత్యనారాయణకు ఉన్న పట్టుదల నేటి యువతలో ఉంటే భవిష్యత్తులో దేశం మహోన్నత శిఖరాలు అధిరోహిస్తుందనడంలో సందేహం లేదు. ఇవీ చూడండి: 'ఓటు స్లిప్పుల' లెక్కపై రివ్యూ పిటిషన్​ కొట్టివేత

Intro:TG_ADB_11_07_8O_ELLA_KURRADU_PKG_C6_HD

Body:అతని వయసు ఎనిమిది పదులు, కానీ కుర్రాళ్ల కంటే ధీటుగా ఎన్నో పథకాలను సాధిస్తున్నాడు , ఈ 80 ఏళ్ల కుర్రాడు బరిలో దిగాడు అంటే పథకాలు సాధించకుండా తిరిగి రాడు. దేశం ఏదైనా సరే తన సత్తా చాటి ఔరా అనిపిస్తున్నాడు. ఈ మళ్లీ వయసు యువకుడిపై ఈటీవీ కథనం.....

ఈయన పేరు నర్రా సత్యనారాయణ , మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట లో ఉంటారు. నేటి యువత సాధించలేని పథకాలను ఆయన ఎనిమిది పదుల వయసులో సాధించారు. లక్సెట్టిపేట లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా సేవలందించి పదవీ విరమణ పొందిన తర్వాత శరీర దృఢత్వం పై శ్రద్ధతో వ్యాయామాన్ని ప్రారంభించారు.
తన ముని మనవలతో పరుగెత్తాలని ఆశతో పరుగులను ప్రారంభించిన సత్యనారాయణ జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు పోటీలలో పాల్గొంటాడు. ఆయన సాధించిన పథకాలతో అందరిని ఆశ్చర్య పరిచారు .
ఇటీవలే గుజరాత్ ,మలేషియా , ఇండోనేషియా లోని జకర్తా లో పాల్గొని 800 మీటర్ల పరుగులో , మూడవ స్థానం 100 మీటర్ల పరుగులో రెండవ స్థానం సాధించాడు.
నేటి యువత మద్యానికి బానిసై విలువైన జీవితాలను, దేశ భవిష్యత్తును కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. యువత ఉక్కు కండరాలు, బలమైన సంకల్పం కలిగి ఉండాలని సత్యనారాయణ ఆకాక్షించారు.

ప్రతి నిత్యం శాఖాహారం పౌష్టిక ఆహారం తీసుకోవడం వల్లనే మంచి ఆరోగ్యంగా ఉన్నానని చెబుతున్నారు. ఉదయం మైదానంలో వ్యాయామం తో పాటు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు. అంతేకాకుండా మంచి పౌష్టిక ఆహారాలు తీసుకోవడం వల్లనే పరుగులు చేయగలుగుతున్నాను అని అని అన్నారు.
తనలాంటి క్రీడాకారులు ఆర్థికంగా వెనుకబడి ప్రభుత్వ ప్రోత్సాహం లేక నిరుత్సాహంగా మిగిలిపోతున్నారని అలాంటివారికి ప్రోత్సాహం అందిస్తే మన రాష్ట్రం దేశానికి కీర్తి అందించవచ్చునని వృద్ధ క్రీడాకారుడు సత్యనారాయణ తెలిపారు..

80 ఏళ్ల వయసులో లో సత్యనారాయణ కు ఉన్న కృషి పట్టుదల నేటి యువతలో ఉంటే భవిష్యత్తులో మరెందరో క్రీడాకారులు మన దేశానికి అందే వీలుంది.

బైట్: సత్యనారాయణ, క్రీడాకారుడు లక్సెట్టిపేట

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.