మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తాపీ సంఘ భవనంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, తెరాస నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య హాజరయ్యారు.
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కష్టపడి కౌన్సిలర్లను గెలిపించాలని ఆయన కోరారు. 34 వార్డుల్లోనూ గులాబీ జెండా ఎగిరేలా నాయకులు కృషి చేయాలని ఎమ్మెల్యే చిన్నయ్య అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా సింగరేణి కార్మికుల వారసులకు కారుణ్య నియామకాలు కల్పిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి పాల్గొన్నారు.
ఇవీ చూడండి: దశాబ్ది సవాల్: మలి సంధ్యకు ఊతకర్ర అవుదాం