మంచిర్యాల జిల్లాలో యువకులు, మధ్యవయసు వారిపై కరోనా పంజా విసురుతోంది. నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం వీరే ఉంటున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,110 కేసులు నమోదుకాగా... ఈ నెల 10 వరకు సుమారు 448 మంది యువతకి సోకింది. అంతే కాకుండా పుట్టిన పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందర్నీ వెంటాడుతూనే ఉంది. 15 రోజుల చిన్నారికి సైతం వైరస్ సోకింది. 45 రోజులు, రెండు నెలలు, రెండేళ్ల పిల్లలు కూడా వైరస్ బారిన పడ్డారు.
కోలుకున్నవారు అధికమే
జిల్లాలో ఇప్పటి వరకు 17 మంది కరోనాతో మృతి చెందినప్పటికీ... చాలామంది కోలుకోవడం కాస్త ఊరటనిస్తోంది. జిల్లా యువతలో రికవరీ రేటు 98 శాతంగా ఉంది. అయితే 55 ఏళ్ల వయసుపైబడి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. మృతి చెందిన వారిలో దాదాపు 15 మంది 45 ఏళ్లు దాటిన వారే ఉన్నారు. 30 ఏళ్ల లోపు ఇద్దరు మృతి చెందారు. 5 ఏళ్ళ నుంచి 12 ఏళ్ల వరకు వైరస్ సోకిన పిల్లలంతా పదుల సంఖ్యలోనే ఉన్నారు. తల్లిదండ్రులు కంటికి రెప్పలా చూస్కోవడం శ్రేయస్కరంగా మారింది.
వయసుల వారీగా జాబితా
వయస్సు | కేసులు |
0-18 | 67 |
19-35 | 448 |
36-55 | 440 |
55 ఆ పైన | 155 |