నెలరోజుల ముందుగానే బతుకమ్మ పండుగ రావడంతో మహిళలు ఆడిపాడారు. ఉదయం నుంచే చిన్నా పెద్దా తేడా లేకుండా రంగురంగుల పూలు సేకరించి పాటలు పాడుతూ బతుకమ్మలను పేర్చారు.
పరిమితంగానే..
కరోనా నేపథ్యంలో మహిళలు పరిమిత సంఖ్యలో వచ్చి బతుకమ్మ ఆడటం కనిపించింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంతో పాటు నియోజకవర్గంలోని తాండూరు, నెన్నెల, కాసిపేట భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి మండలాల్లో మహిళలు ఎంగిలిపూల బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. కరోనా విస్తరిస్తున్న సమయంలో గతంలో కంటే సందడి చాలావరకు తగ్గింది. నిరాండబరంగానే బతుకమ్మ ఆడారు.
ఇవీ చూడండి : తెలంగాణ సాయుధ పోరాటం మతకోణంలో చూడరాదు : బృందాకారత్