తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(తెబొగకాసం) గౌరవాధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి నియమితులయ్యారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శిగా మిర్యాల రాజిరెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా సీసీసీలోని సింగరేణి అధికారుల క్లబ్లో సంఘం కేంద్ర కమిటీ ప్రతినిధుల సమావేశాన్ని నిర్వహించారు.
పాత కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సమావేశంలో వీరి ఎన్నిక విషయం చర్చకు రాగా.. ప్రతినిధులందరూ ఏకగ్రీవంగా సమ్మతి తెలిపారు. త్వరలోనే కేంద్ర కమిటీని పూర్తిస్థాయిలో ప్రకటిస్తామని వెంకట్రావు తెలిపారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ నెల 17న సింగరేణి వ్యాప్తంగా పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
ఇదీ చదవండి : రేపటి నుంచే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ