ETV Bharat / state

'కోటి వృక్షార్చన'లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే

author img

By

Published : Feb 17, 2021, 12:14 PM IST

సీఎం కేసీఆర్​ పుట్టినరోజు సందర్భంగా తలపెట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని అధికారులను ఆదేశించారు.

MLA Durgam Chinnayya planted plants in 'Koti Vriksharchana'
'కోటి వృక్షార్చన'లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

ముఖ్యమంత్రి కేసీఆర్​ జన్మదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. పట్టణంలోని పౌర సరఫరాల గిడ్డంగి కేంద్రంలో 1,000 మొక్కలు, గ్రంథాలయ ఆవరణలో 30 మొక్కలను నాటారు. అనంతరం కేక్​ కట్​ చేసి సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని మున్సిపల్​ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ గడ్డం కల్యాణి, మున్సిపల్​ ఛైర్పర్సన్ జక్కుల శ్వేత తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: సీఎం కేసీఆర్​కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.