ETV Bharat / state

సంక్షోభంలోనూ సంక్షేమం: ఎమ్మెల్యే దివాకర్​ రావు - ev bharath

కరోనా విపత్కర సమయంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కేసీఆర్​కే దక్కుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్​ రావు అన్నారు. నియోజకవర్గంలోని 1000 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందించారు.

mla divakar rao distribution kalyanalaxmi cheques in manchiryala
సంక్షోభంలోనూ సంక్షేమం: ఎమ్మెల్యే దివాకర్​ రావు
author img

By

Published : Sep 12, 2020, 4:32 PM IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే దివాకర్​ రావు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. వివిధ మండలాలకు చెందిన 1000 మంది లబ్ధిదారులు ఈ పథకంలో లబ్ధిపొందారు. కరోనా విపత్కర సమయంలోనూ సీఎం కేసీఆర్​ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని గుర్తు చేశారు.

లబ్ధిదారులు దళారుల వద్దకు వెళ్లొద్దని, ఎవరైనా చెక్కులు ఇప్పిస్తానని లంచం అడిగితే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. పేద తల్లిదండ్రులకు కల్యాణ లక్ష్మితో కాస్త ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు.

ఇదీ చదవండి:'ఆ మూడు కేంద్ర ఆర్డినెన్స్‌లను వ్యతిరేకిస్తూ 14న దేశవ్యాప్త సమ్మె'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.