మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. బెల్లంపల్లి మండలం కన్నాల, తాళ్ల గురజాల గ్రామాల్లో రైతు వేదికల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కన్నెపల్లి మండలం రెబ్బెన అటవీ ప్రాంతంలో 11 వేలు మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
బెల్లంపల్లి ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. కలెక్టర్ భారతి హోలికెరీ, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ పురాణం సతీష్, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ భాగ్యలక్ష్మి, రామగుండం కమిషనర్ సత్యనారాయణ, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: చేనేత రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు: కేటీఆర్