కూరగాయలు, మాంసం మార్కెట్ల వద్ద కొనుగోలుదారులు గుమిగూడకుండా మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీసులు వినూత్నరీతిలో చర్యలు చేపట్టారు. వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా పట్టణంలో 4 చోట్ల మార్కెట్లను ఏర్పాటు చేశారు. వీటిని కొనుగోలు చేసే ప్రజలు నడుచుకుంటూ రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానంపై ప్రజలు నుంచి మంచి స్పందన వచ్చింది. పట్టణవాసులు కాలినడకన వచ్చి భౌతిక దూరం పాటిస్తూ సరుకులను కొనుగోలు చేశారు. నిబంధనలు పాటించని ఐదుగురి వాహనాలను పోలీసులు సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి: 'కరోనా అయితే నాకేంటి? నా దగ్గరకు అది రాలేదు'