పరీక్షలంటే విద్యార్థులకు భయం పోవాలని సింగరేణి సంస్థ మందమర్రి ఏరియా జీఎం రమేష్‌రావు అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని సింగరేణి పాఠశాలలో విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ చేశారు. సొంత ఖర్చుతో విద్యార్థులకు అవసరమైన పరీక్ష సామగ్రి పంపిణీ చేశారు.
తక్కువ ఫీజుతో సింగరేణి విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు రమేష్‌రావు తెలిపారు. విద్యార్థులంతా మంచి మార్కులు సాధించి.. వారి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం పరీక్ష విధానంపై పలు సూచనలు చేశారు.
ఇవీచూడండి: 'మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటున్నారు'