మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు మంచిర్యాల శాసనసభ్యుడు దివాకర్ రావు 'ప్రతి ఆదివారం 10గంటలకు 10 నిమిషాలు' కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. మంచిర్యాల జిల్లాలోని తన నివాసంలోనే ఎయిర్ కూలర్లో నిలువ ఉన్న నీటిని ఎమ్మెల్యే తొలగించారు. అంటువ్యాధులను నివారించేందుకు ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రం చేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.
దోమల నివారణ కోసం ప్రతి ఆదివారం పది నిమిషాల పాటు విధిగా ఇంట్లో, పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉన్న మురికి నీటిని తొలగించాలని ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రజలకు తెలిపారు.
ఇవీ చూడండి: 'ఆదివారం ఉ.10 గంటలకు'... దోమల స్థావరాలు ధ్వంసం చేసిన కేటీఆర్