ETV Bharat / city

'ఆదివారం ఉ.10 గంటలకు'... దోమల స్థావరాలు ధ్వంసం చేసిన కేటీఆర్​

ప్రగతిభవన్​లో "ప్రతి ఆదివారం 10 గంటల 10 నిమిషాల" కార్యక్రమంలో మంత్రి కేటీఆర్​ పాల్గొన్నారు. రానున్న పది ఆదివారాలపాటు.. పది నిమిషాలు చొప్పున ప్రతి ఒక్కరు తమ ఇళ్లు, పరిసరాలను పరిశుభ్రపరుచుకోవాలని సూచించారు.

'ఆదివారం ఉ.10 గంటలకు 10 నిమిషాల'లో కేటీఆర్​

author img

By

Published : May 10, 2020, 1:46 PM IST

Updated : May 10, 2020, 2:04 PM IST

'ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు' కార్యక్రమంలో మంత్రి కేటీఆర్​ పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల నివారణ కోసం పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ప్రగతి భవన్​లోని పూల కుండీలు, ఇతర ప్రాంతాలను మంత్రి తారక రామారావు పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో పేరుకుపోయిన నీటిని శుభ్రం చేశారు. ప్రగతి భవన్ ప్రాంగణం మొత్తం కలియ తిరిగిన కేటీఆర్​... జీహెచ్​ఎంసీ ఎంటమాలజీ విభాగం సలహా మేరకు యాంటీ లార్వా మందులను చల్లారు.

రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి తెలిపారు. యాంటీ లార్వా మందులు చల్లటం, నీరు నిల్వ లేకుండా చూసుకోవటం ద్వారా దోమల వ్యాప్తిని అరికట్టవచ్చని కేటీఆర్​ అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలని మంత్రి కోరారు. రానున్న పది ఆదివారాలపాటు.. పది నిమిషాలు చొప్పున ప్రతి ఒక్కరు తమ ఇళ్లు, పరిసరాలను పరిశుభ్రపరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్​ఎంసీ మేయర్​ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.

'ఆదివారం ఉ.10 గంటలకు 10 నిమిషాల'లో కేటీఆర్​

ఇవీచూడండి: ఈనాడు-ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. చిన్నారికి కంటి చూపు

Last Updated : May 10, 2020, 2:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.