ETV Bharat / state

జరిమానా వేసినా...తగ్గని ఉల్లంఘనలు - రహదారులపై ఉల్లంఘనలు

రహదారులపై నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధిస్తామంటూ ట్రాఫిక్‌ పోలీసులు నిత్యం హెచ్చరిస్తున్నా.. కొందరిలో ఎలాంటి మార్పు రావడం లేదు. ప్రమాదాల నియంత్రణకు, సురక్షిత ప్రయాణానికి శిరస్త్రాణం ధరించాలంటూ, అన్నిపత్రాలు కలిగి ఉండాలని, నిబంధనలు పాటించాలని అధికారులు పదేపదే చెబుతున్నారు. అయినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించే ద్విచక్ర వాహన చోదకులపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు.

జరిమానా వేసినా...తగ్గని ఉల్లంఘనలు
author img

By

Published : Jul 7, 2019, 12:26 PM IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలు... జన సంచార ప్రాంతాల్లో నిలిపిన వాహనాల ఫొటోలు తీసి యజమానులకు ఈ- చలానాలు పంపుతున్నారు. మార్కెట్‌రోడ్డు, బస్టాండు, బెల్లంపల్లి చౌరస్తా, వెంకటేశ్వర థియేటర్, ముఖరాం చౌరస్తా, శ్రీనివాస థియేటర్‌రోడ్‌ ప్రాంతాల్లో అపసవ్యదిశలో వస్తున్న వాహన చోదకులను ఆపి వారికి చలానా చేతికిచ్చి సరైన మార్గంలో పంపుతున్నారు. హోటళ్లు, బార్లు, షాపింగ్‌మాల్స్, రెస్టారెంట్ల వద్ద నో- పార్కింగ్‌ స్థలంలో నిలిపిన వాహనాలపైనా జరిమానాలు విధిస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు ఇంతగా చర్యలు తీసుకుంటన్నా సరే కొందరు వాహన చోదకులు మాత్రం చలానాలేగా అన్నట్టు ప్రవర్తిస్తున్నారు.

mancherial vehicle tax traffic police
జరిమానా వేసినా...తగ్గని ఉల్లంఘనలు

ట్రాఫిక్‌ కూడళ్ల వద్ద
ప్రమాదాల సమయంలో శిరస్త్రాణం వల్ల కలిగే ప్రయోజనాలపై ట్రాఫిక్‌ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పరిస్థితి కొంతమెరుగైనా ధరించేవారి సంఖ్య ఆశించినంత పెరగలేదు. ఈ ఏడాది జనవరి నుంచి ఈ-చలానాల జోరు పెంచారు. ట్రాఫిక్‌ కూడళ్ల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకూ కొంతమంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి కెమెరాలతో ఫొటోలు తీయించి ఈ-చలానాలు పంపిస్తున్నారు.

రోడ్డుపైనే పార్కింగ్‌
ఇక వాహనాలను పార్కింగ్‌లేని ప్రాంతాల్లో, రహదారులపై ఉంచవద్దని పోలీసులు చేస్తున్న హెచ్చరికలనూ యజమానులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్‌ పోలీసులు స్పాట్‌ చలానాలు ఇస్తున్నా, వారి వైఖరిలో మార్పు కనపడటం లేదు. కొందరు కార్ల యజమానులైతే రోడ్డుపైనే ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించేలా నిలిపి వెళ్తున్నారు. వారిపై జరిమానాలు విధిస్తున్నా, ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి : ప్రాణాలు పోతున్నా డాక్టర్లు ఉండరా..?

tg_mbnr_07_06_140gorre_pillala_mruthi_av_ts10096 జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ చెన్నిపాడు తక్కసిల గ్రామాలలో గొర్రె పిల్లల మందల పై కుక్కల దాడి. దాడి ఘటనలో గొర్రెల కాపరులకు చెందిన సుమారు 140 గొర్రె పిల్లల మృత్యువాత.. చెన్నిపాడు గ్రామ శివారులో ఉదయం నలుగురు గొర్రెల కాపరులు కంచె ఏర్పాటుచేసి కంచె లొ గొర్రెపిల్లలను ఉంచి గొర్రెలను మేపడానికి వెళ్లడంతో గొర్రెపిల్లల మందపై కుక్కలు దాడి చేసి 80 గొర్రెపిల్లలను ఆదేవిందగ తక్కశిల గామంలో 8 మందికి చెందిన 60 గొర్రెపిల్లలను చంపి వేసాయి అని సుమారు మూడు లక్ష ల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు గొర్రెల కాపరులు గొల్ల వెంకటరాముడు, శ్రీనివాసులు, గొల్ల రాముడు, గొల్ల పరుశరాముడు, గొల్ల తిమ్మన్నలు తెలిపారు.ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.