మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో అన్యాయంగా హత్యాచారానికి గురైన టేకు లక్ష్మీకి న్యాయం చేయాలంటూ అన్ని వర్గాల ప్రజలు రహదారులను మూసివేశారు. వాహనాల రాకపోకలు ఎక్కడిక్కడకే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
దిశ ఘటన నిందితులను ఎన్కౌంటర్ చేసినట్లు టేకు లక్ష్మిని చంపిన నిందితులను కూడా ఎన్కౌంటర్ చేయాలని బుడిగ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సుజాత డిమాండ్ చేశారు. దిశ ఘటన కంటే ముందు టేకు లక్ష్మీపై హత్యాచారం జరిగినప్పటికీ... నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
దిశ ఘటనలో స్పందించిన తరహాలో ప్రభుత్వం లక్ష్మీ విషయంలోనూ స్పందించాలని కోరారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: ఈనెల 11న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం