మంచిర్యాల జిల్లాలో ఒకే డిపో ఉన్నప్పటికీ అద్దె బస్సులతో పాటు అదనంగా మరిన్ని బస్సులను నడిపి ప్రజలకు రవాణా సేవలను అందిస్తున్నారు. దీంతోపాటు నెలకు పైగా బస్సులు డిపోకే పరిమితం కావడంతో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
సంస్థపై పెను ప్రభావం
లాక్‌డౌన్ ప్రభావం సంస్థతో పాటు సిబ్బందిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అసలే నష్టాల్లో కూరుకుపోయినందున లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటికీ ఆ సమస్యలు పరిష్కరించడం ప్రభుత్వానికి సవాలుగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.