మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నర్సింగాపూర్లో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. డీసీపీ రక్షిత ఆధ్వర్యంలో గోదావరి రోడ్డులో పోలీసులు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకోవాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు. రోజువారి కార్యక్రమంలో భాగంగా ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో మొక్కలు నాటుతున్నామన్నారు.
ఇవీ చూడండి: ఉపరితల ఆవర్తనం.. మూడురోజుల పాటు వర్షాలు..