గుండా మల్లేశ్ అకాల మరణం పార్టీకి తీరని లోటని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విజయవాడ దాసరి భవన్లో నిర్వహించిన సంతాప సభకు హాజరయ్యారు. మల్లేశ్ చిత్రపటానికి పూలమల వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఏపీలో నాలుగు సార్లు పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందించారని కొనియాడారు.
దళిత హక్కుల పోరాట సమితి తరఫున జాతీయ స్థాయిలో పనిచేసిన ఆయన, రైతుల హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారని రామకృష్ణ గుర్తు చేసుకున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలతో సన్నిహితంగా ఉంటూ వెనుకబడిన వారి అభ్యున్నతి కృషి చేశారని కీర్తించారు.
ఇదీ చదవండి: 'నేను2' పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత