మంచిర్యాల జిల్లా మందమర్రి, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, భీమారం మండలాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో మహా శివరాత్రి వేడుకలు నిర్వహించుకుంటున్నారు. గోదావరి నదిలో స్నానమాచరించి... అనంతరం శివునికి ప్రత్యేక అభిషేకం చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుటుంబాన్ని చల్లగా చూడాలని వేడుకుంటున్నారు.
దైవ నామస్మరణతో జిల్లావ్యాప్తంగా శివాలయాలు మార్మోగాయి. భారీగా భక్తులు రావడం వల్ల శివాలయాల్లో సందడి నెలకొంది. దైవదర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు.
ఇవీ చూడండి: శ్రీశైలంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు