మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు 10 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని ఏఐటీయూసీ నేత వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. ఇంటి కిరాయి చెల్లించాల్సిన యజమాన్యం ఇప్పటివరకు చెల్లించలేదని ఆరోపించారు.
నస్పూర్ మున్సిపాలిటీలోని సింగరేణి కార్మికులకు హెచ్ఆర్ఏ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట చేస్తున్న రిలే నిరాహార దీక్ష ఎనిమిదో రోజుకు చేరింది. వేజ్ బోర్డు ప్రకారం 10 శాతం ఇంటి కిరాయి చెల్లించాలని వాసిరెడ్డి స్పష్టం చేశారు. డిమాండ్లు నెరవేర్చాలని ఎస్ఆర్పీ మూడో గనిలోని కార్మికులు నినదించారు.
టీజీబీకేఎస్ వల్లే..
ఇదే సమస్యపై గతేడాది 12 రోజులు రిలే నిరాహార దీక్ష చేస్తే యాజమాన్యం అంగీకరించి నోట్ విడుదల చేసిందని సీతారామయ్య అన్నారు. టీజీబీకేఎస్ కార్మిక సంఘం వల్లే హెచ్ఆర్ఏ రాలేదని ఆరోపించారు. ఎనిమిది రోజులు గడుస్తున్నా.. ఎవరూ స్పందించలేదని మండిపడ్డారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌గా 4 ఏళ్లు.. అభివృద్ధి పనుల వివరణ