మంచిర్యాల జిల్లా కేంద్రంలో హైటెక్ కాలనీ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోమియోపతి వైద్యుడు రామకృష్ణ ఉచితంగా హోమియోపతి మందులను పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా... నివారణ చర్యలను గురించి అవగాహన కల్పించారు.
కరోనా గురించి భయపడనవసరం లేదని... వ్యక్తిగత శుభ్రత, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే... మన దేశం నుంచి మహమ్మారిని పంపిచేయవచ్చని రామకృష్ణ వెల్లడించారు. అవసరమైన వారికి తన క్లినిక్ సంప్రదిస్తే ఉచితంగా హోమియోపతి మందులు అందిస్తామని చెప్పారు.
ఇవీ చూడండి: కరోనా ఎఫెక్ట్: సరిహద్దుల మూసివేత