ETV Bharat / state

పగిలిన గూడెం ఎత్తిపోతల పథకం పైప్‌లైన్‌... నీటిపాలైన 200 ఎకరాలు

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంలోని సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం నాణ్యత లోపం మరోసారి బయటపడింది. రంగంపల్లి శివారులో పైపులైన్ పగిలి సుమారు 200 ఎకరాలు నీటమునిగాయి. వరి పొలాలు నీట మునిగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

gudem lift irrigation project pipeline leakage at rangampally mancherial district

author img

By

Published : Mar 10, 2021, 5:14 PM IST

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రంగంపల్లి శివారులో గూడెం సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం పైప్‌లైన్‌ మరోసారి పగిలిపోయింది. సుమారు 200 ఎకరాల వరి పొలాలు నీటమునిగాయి. ఎత్తిపోతల పథకం పనుల్లో నాణ్యత లోపం వల్లే పైపులు పలుగుతున్నాయని అన్నదాతలు ఆరోపిస్తున్నారు.

ప్రవాహ తీవ్రతకు బోరు బావుల్లో మట్టి కూరుకుపోయింది. పొలాల్లోకి ఇసుక కొట్టికొచ్చి మేటలు వేసిందని రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు స్పందించి నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని, శాశ్వత పరిష్కారం చూపాలని‌ కోరుతున్నారు.

పగిలిన గూడెం ఎత్తిపోతల పథకం పైప్‌లైన్‌... నీటిపాలైన 200 ఎకరాలు

ఇదీ చదవండి : భర్తను హత్య చేసి ఇంట్లో పూడ్చిపెట్టిన భార్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.