మంచిర్యాల జిల్లా కస్తూర్బా గాంధీ పాఠశాల పచ్చదనాన్ని పరుచుకుంది. ఎటు చూసినా మొక్కలతో నిండి పోయింది. కస్తూర్బా పాఠశాలలో ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయుల పుట్టిన రోజున మొక్కలు నాటుతారు. ఇప్పటి వరకు 600 రకాల మొక్కలు నాటారు. ప్రతి శనివారం ఇక్కడ విద్యార్థులు తోట పని చేస్తుంటారు. ఇటీవల ఆకుకూరలతోపాటు కూరగాయల సాగును ప్రారంభించారు.
మొక్కల దత్తత
పాఠశాలలో ప్రతి విద్యార్థికి నాలుగు మొక్కలను దత్తత ఇచ్చారు. ఈ మొక్కలకు నీరు పోస్తూ సంరక్షించాల్సిన బాధ్యత ఆ విద్యార్థులపై ఉంటుంది. పట్నం బంతి మొక్కలు పెరగడం వల్ల పాఠశాల కొత్త శోభను సంతరించుకుంది. ప్రకృతి అందాలను చూసిన తల్లిదండ్రులు, విద్యార్థులు మంత్ర ముగ్ధులవుతున్నారు.
మొక్కలకు తొట్లుగా
పాఠశాల వాడిన ఫినాయిల్ డబ్బాలు, తాగునీటి డబ్బాలను కత్తిరించి మొక్కలకు తొట్లుగా వినియోగిస్తున్నారు. కస్తూర్బా విద్యాలయంలో విద్యార్థులు చురుకుగా గడ్డి తొలగిస్తూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకుంటున్నారు. కొత్తరకం మొక్కలు ఏవి వచ్చినా.. ప్రత్యేక అధికారి చొరవ తీసుకుని విద్యార్థులతో నాటిస్తున్నారు. ఈ పాఠశాలలో పనిచేసే తోటమాలి భీమమ్మ మొక్కలపై చక్కని పాటలు పాడుతూ అలరింపజేస్తోంది. విద్యార్థులు కూడా ఈమె పాటలకు శ్రుతి కలుపుతూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు.
ఇదీ చూడండి :హుజూర్నగర్లో వేడెక్కిన రాజకీయం...