మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి రోడ్లో జరుగుతున్న మహాక్రతువు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భూమిపై నివసించే ప్రాణులకు మహోపకారం చేయుచున్న సూర్య భగవానుడు మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవమని నిర్వాహకులు తెలిపారు. సకల జీవరాశులకు మేలు చేసే సూర్యునికి సౌరయాగం చేస్తున్నామని అన్నారు. లోకకళ్యాణార్థం సహస్ర ఘటాభిషేకం, సహిత మహా సౌరయాగం మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ప్రత్యేక పూజలు, హోమాలతో యాగశాల కళకళలాడుతోంది. శృంగేరి ఆస్థాన పౌరాణికులు సంతోష్ కుమార్ శర్మ ఈ యాగానికి యజ్ఞ ఆచార్యులుగా వ్యవహరిస్తున్నారు. దేవతా మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి మూడు రోజుల పాటు జరగనున్న ఈయాగంలో సుమారు 108 జంటలు భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : నడిరోడ్డుపై పోకిరిని చితక్కొట్టిన మహిళలు