ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలలే మిన్న : డీసీపీ

ప్రైవేటు విద్యా వ్యవస్థకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అందిస్తున్నారని మంచిర్యాల డీసీపీ రక్షిత కృష్ణమూర్తి తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను సన్మానించారు.

విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు సన్మానం
author img

By

Published : Jun 16, 2019, 4:21 PM IST

ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఉత్తమ విద్యార్థులకు మంచిర్యాల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రక్షిత కృష్ణమూర్తి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఏకలవ్య ఫౌండేషన్, విద్యావాహిని యూత్ ఫర్ సేవ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, రవాణా కార్యాలయ అధికారి వివేకానంద రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు ఉన్నత స్థితిలో ఉన్నారని, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యా బోధనలు అందిస్తోందని డీసీపీ ప్రశంసించారు. మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను సన్మానించి ప్రతిభా పురస్కారాలను అందించారు.

ప్రైవేటు విద్యా వ్యవస్థకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు : డీసీపీ

ఇవీ చూడండి : 'ఐదు అంశాలపై చర్చింద్దాం రండి'

Intro:TG_ADB_11_16_GOVT SKOOL STUDENT PURSKARALU_AV_C6

Body:ప్రభుత్వ పాఠశాలలో పునర్వైభవం చేస్తున్న ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసిన మంచిర్యాల డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రక్షిత కృష్ణమూర్తి.

ఏకలవ్య ఫౌండేషన్ విద్యావాహిని యూత్ ఫర్ సేవ స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసే కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిసిపి రక్షిత కృష్ణమూర్తి, రవాణా కార్యాలయ అధికారి వివేకానంద రెడ్డి పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు చాలా ఉన్నత స్థితిలో ఉన్నారని, నేడు సమాజంలో లో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యాలయాలు పనిచేస్తున్నాయని డి సి పి తెలిపారు.
ప్రభుత్వాలు సైతం విద్యపై ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నాయని దీనికి కారణం విద్యార్థి దశ నుంచి చక్కని క్రమశిక్షణ అలవర్చుకున్న విద్యార్థి దేశ ప్రగతికి ప్రయోగ పడతారని ఉద్దేశంతోనే దేశంలోని ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యాలయాలలో చదువుకునే విద్యార్థులకు మంచి విద్యను అందించాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయన్నారు.

చాలామంది తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో విద్య చిన్న చూపు చూడడం వలన నేడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం తగ్గిపోయిందని ఆమె తెలిపారు.

అనంతరం మంచిర్యాల జిల్లాలో ని ప్రభుత్వ పాఠశాలలో లో ఉత్తమ ఫలితాలను అందించిన విద్యార్థినీ విద్యార్థుల తో పాటు ఉపాధ్యాయులను సన్మానించి వారికి ప్రతిభా పురస్కారాలను అందించారు...

byte : రక్షిత కృష్ణమూర్తి , మంచిర్యాల డిసిపి

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.