ETV Bharat / state

అడవిదున్నను కాపాడిన ఫారెస్ట్ అధికారులు - అంకాయిపల్లి శివారులోని వ్యవసాయ బావిలో పడిన దున్న

వ్యవసాయబావిలో పడిపోయిన అడవిదున్నను ఫారెస్ట్ అధికారులు రక్షించారు. మంచిర్యాల జిల్లా అంకాయిపల్లి శివారులో రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు పడిపోయింది.

Forest officers recused  protect wild animal i
వ్యవసాయబావిలో పడిపోయిన అడవిదున్నను రక్షించిన ఫారెస్ట్ అధికారులు
author img

By

Published : Mar 28, 2021, 7:35 PM IST

రెండు రోజుల క్రితం వ్యవసాయబావిలో పడిపోయిన అడవి దున్నను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు అటవీ సిబ్బంది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అంకాయిపల్లి శివారులోని అడవి సమీపంలో ఉన్న వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. అటవీ అధికారులు తీవ్రంగా శ్రమించి జేసీబీ సహాయంతో బయటకు తీశారు.

అంకాయిపల్లి గ్రామ సమీపంలో అడవిదున్న శుక్రవారం రాత్రి పడిపోగా.. దాని అరుపులు విన్న స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎఫ్​ఆర్వో మజారుద్దీన్, సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. అడవిదున్న బావిలో అలజడి సృష్టించగా జేసీబీతో పైకి ఎక్కేలా చేశారు. దీంతో అక్కడి నుంచి అడవిదున్న మళ్లీ స్వేచ్ఛగా అడవి బాట పట్టింది. ఎలాంటి అపాయం జరగకపోవడంతో అటవీ అధికారులు, స్థానికులు ఉపిరి పీల్చుకున్నారు.

ఇదీ చూడండి: జర్నలిస్టులకు సురవరం ఆదర్శం: ఎర్రబెల్లి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.