మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కుంట రాములు బస్తీలో విద్యుత్ షాక్తో ఏడు పశువులు మృతి చెందాయి. దేవాజీ అనే వ్యక్తికి చెందిన ఐదు గేదెలు, ఒక ఎద్దు, ఒక ఆవు తెగిపడిన 11 కేవీ విద్యుత్ తీగలకు తాకి.. కరెంట్ షాక్తో చనిపోయాయి. ఒక్కసారే ఏడు పశువులు మృతి చెందడం వల్ల బాధితులు గుండెలవిసేలా రోదించారు. అధికారులు స్పందించి నష్టపరిహారం అందిచాలని వేడుకున్నారు.
ఇదీ చదవండి: 'యూ ఫర్ అగ్లీ' అని నేర్పిన టీచర్లు.. సస్పెండ్!